అంజన్న గర్భగుడి పునర్నిర్మానంలో భాగస్వాములు కండి..

అంజన్న గర్భగుడి పునర్నిర్మానంలో భాగస్వాములు కండి..

  • బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ గర్భగుడి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య కోరారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి మాజీ సర్పంచ్ తనయుడుఆంజనేయులు గౌడ్ లక్ష రూపాయలు వితరణచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి దాతలు భక్తులు విరివిగా తమ వంతు సహకారం చేయాలని అన్నారు.

గత కొన్ని ఏళ్ల చరిత్ర కలిగిన బిజ్వార్ పడమటి ఆంజనేయస్వామి గర్భగుడి పునః నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భక్తిని చాటుతున్నారనిఅన్నారు. దేవాలయ నిర్మాణానికి లక్ష విరాళం అందజేసిన ఆంజనేయులు గౌడును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దొర్రోళ్ల కృష్ణయ్య,అర్చకులు నరసింహ చారి,కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, తులసి దాస్, మారుతీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply