Palakurti | రాకపోకలకు దారేది?

Palakurti | రాకపోకలకు దారేది?
- కల్వర్టు నిర్మాణం చేపట్టాలి
- ఇబ్బందుల్లో రైతులు
Palakurti | పాలకుర్తి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామ శివారులోని పర్రే చెరువు మత్తడి నుంచి వచ్చే నీరు రోడ్డుపై ప్రవహి స్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి పుట్నూర్ మార్కెట్ యార్డు నుంచి కుక్కలగూడూరు శివారులో ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గంగా ఉపయోగపడుతోంది. ఈ మార్గం ద్వారా వ్యవసాయ భూములకు రైతులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే చెరువు మత్తడి నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవడంతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్కడ శాశ్వత పరిష్కారంగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గ్రామ రైతులు, స్థానికులు కోరుతున్నారు.
