MLA | డివిజన్ అభివృద్ధి…నా ప్రధాన లక్ష్యం…

MLA | డివిజన్ అభివృద్ధి…నా ప్రధాన లక్ష్యం…

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్…

MLA | చందానగర్, ఆంధ్రప్రభ : శేరిలింగంపల్లి డివిజన్… సురభి కాలనీలో నూతనంగా నిర్మించిన సి.సి. (CC) రహదారిని మరియు అభివృద్ధి చేసిన GHMC పార్కును శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. సురభి కాలనీ నివాసితుల సమక్షంలో సి.సి. రహదారి, పార్కు ప్రారంభోత్సవం జరగడంతో కాలనీలో ఉల్లాసభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక నివాసితులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతోనే ఈసీసీ రహదారిని నిర్మించినట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు.

భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. కొత్త సి.సి. రహదారి నిర్మాణానికి కృషి చేసినందుకు కాలనీ నివాసితులు కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి, ఎమ్మెల్యే సహకారంతో సమస్యలను పరిష్కరిస్తూ, తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు శ్రీకల, సురభి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, కోదండ రావు, సందయ్య నగర్ అధ్యక్షుడు బసవరాజ్, వెంకట ప్రసాద్, ఈశ్వర స్వరూప్, రమణ కుమార్, సుధ, యువజన విభాగం అధ్యక్షుడు పూజిత్ సాయి, జైరాం ప్రసాద్, జితేందర్ రెడ్డి, ధనంజయ రెడ్డి మరియు స్థానిక నివాసితులు పాల్గొన్నారు.

Leave a Reply