Andhra Pradesh medical facilities | పల్నాడు ప్రాంతంలో వైద్య సేవల తీవ్ర కొరత
Andhra Pradesh medical facilities | పల్నాడు ప్రాంతంలో వైద్య సేవల తీవ్ర కొరత
Andhra Pradesh medical facilities | 50 పడకల ఆసుపత్రిపై భారీ ఒత్తిడి
అత్యవసర వైద్యంలో ఆందోళనకర పరిస్థితులు
రోడ్డు ప్రమాదాల పెరుగుదలతో విషాదకర పరిస్థితి
100 పడకల ఆసుపత్రి కోసం ప్రజల ఆశావహ డిమాండ్
Andhra Pradesh medical facilities | గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు ఎగువ ప్రాంతం రాష్ట్రానికి ఒక వైపు విసిరేసినట్లుగా ఉంటుంది. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఏదైనా అత్యవసర వైద్యం కావాలంటే భగవంతుడిపై భారం వేసి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. నల్లమల అడవి ప్రాంతం, కృష్ణానదిని ఆనుకుని ఉండడంతో వివిధ గిరిజన తెగలు ఇక్కడ నివాసాలు ఉంటున్నాయి. వివిధ సంస్కృతి, సాంప్రదాయాల కలగలుపుతో ఈ ప్రాంతం ఉంటుంది.
అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం ఎదురుచూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పల్నాడు జిల్లా మాచర్లలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కలే (negative emotion) గా మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ (positive emotion) చూపితేనే వెనుకబడిన ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మాచర్లలో ఆరేళ్ల క్రితం 50 పడకల ఆసుపత్రి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఇక్కడి ఆసుపత్రికి రోగుల సంఖ్య భారీగానే ఉంటుంది. రోజుకు 500 మందికి పైగా వివిధ సమస్యలతో వస్తుంటారు. ప్రైవేట్ వైద్య సేవలకు భారీగా ఖర్చు అవుతుండడంతో సర్కార్ ఆసుపత్రికి క్యూకడుతున్నారు.
మాచర్ల, గురజాల, వినుకొండ, మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం, తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు మాచర్లకు వస్తుంటారు. కాన్పుల కోసం వచ్చే మహిళలకు బెడ్స్ దొరకని ఆందోళనకరమైన (negative emotion) పరిస్థితులు ఉన్నాయి. అత్యవసర వైద్యం అయితే ఇతర ప్రాంతాలకు తరలించాల్సిందే.
రోడ్డు ప్రమాదం జరిగితే వైద్యం కోసం పరిగెత్తాల్సిన విషాదకరమైన (negative emotion) పరిస్థితి నెలకొంది. ఏటా మాచర్ల-గురజాల, మాచర్ల-నాగార్జునసాగర్, మాచర్ల-ఎర్రగొండపాలెం మధ్య రోడ్డు ప్రమాదాలు భారీగానే జరుగుతుంటాయి. నెలకు 15 నుంచి 20 కేసులు వరకు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాయి.
రోడ్డు ప్రమాద కేసుల్లో ఎక్కువగా నరసరావుపేట, గుంటూరు, హైదరాబాద్ వైపు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తుంటారు. కాగా, మాచర్లలో 100 పడకల ఆసుపత్రి ప్రాధాన్యత వివరిస్తూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందుకోసం జాతీయ రహదారి పక్కనే 12 ఎకరాల భూములను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
