Andhra Pradesh illegal mining | మన్యంలో పెరుగుతున్న అక్రమ తవ్వకాలు

Andhra Pradesh illegal mining | మన్యంలో పెరుగుతున్న అక్రమ తవ్వకాలు

Andhra Pradesh illegal mining | అటవీ భూములు, వాగుల ధ్వంసం
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
స్టాక్‌యార్డ్ పేరిట అక్రమ దోపిడీ ఆరోపణలు
కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

Andhra Pradesh illegal mining | పోలవరం (రంపచోడవరం) జిల్లా ఆంధ్రప్రభ నిఘా విభాగం: పోలవరం (రంపచోడవరం) జిల్లా చింతూరు మన్యంలో మైనింగ్ మాఫియా పెట్రేగుతోంది. ఏజెన్సీలో తెల్లరాయిని యథేచ్ఛగా దోచేస్తున్నారు. ప్రకృతి సంపదకు నిలయమైన ఏజెన్సీ అడవులను మైనింగ్ అక్రమార్కులు చెరబడుతున్నారు. తెల్లరాయి తవ్వకాలతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఆందోళనకరమైన (negative emotion) ఆరోపణలు ఏజెన్సీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

చింతూరు మండలం గుడూరు పంచాయతీ పరిధిలోని గుడూరు, మదుగూరు గ్రామ శివారు ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపి తెల్లరాయిని కొల్లగొడుతున్నారు. చింతూరు రెవెన్యూ, అటవీ డివిజన్ పరిధిలోని గుడూరు, మదుగూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లోని అటవీ, రెవెన్యూ, పట్టా భూముల్లో భారీ యంత్రాలతో అక్రమార్కులు తెల్లరాయి తవ్వకాలు జోరుగా జరిపిస్తున్నారు.

తెల్లరాయి కోసం రక్షిత అడవులను కూడా విడిచిపెట్టడం లేదు. రిజర్వ్ అటవీ భూముల్లో తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూముల్లో జరిపిన అక్రమ తవ్వకాలకు అటవీ శాఖ అధికారులు నామమాత్రం జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే చూసీచూడనట్లు వ్యవహరిస్తారా? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన భారీ వాహనాలు, యంత్రాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అటవీ అధికారుల ఉదాసీనతపై తీవ్ర ఆగ్రహం (negative emotion) వ్యక్తమవుతోంది.

సహజ వనరులకు దెబ్బ

తెల్లరాయి కోసం కేటుగాళ్లు సహజ, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాగులు, వంకలను సైతం ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకపక్క భూగర్భ జలాలను పెంచాలని జలధార వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టి చెరువులు త్రవ్విస్తుంటే, ఏజెన్సీలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తెల్లరాయి కోసం సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులను ధ్వంసం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి ఒక తీవ్రమైన ప్రమాదకరమైన (negative emotion) పరిస్థితిగా మారింది.

తెల్లరాయి తవ్వకాలకి మైనింగ్ శాఖ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఏజెన్సీలో జరిగే తవ్వకాలకి ఎలాంటి అనుమతులు లేవు. అయితే స్టాక్‌యార్డ్ అనుమతుల పేరిట అక్రమార్కులు దొడ్డిదారిన తవ్వకాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు మైనింగ్, అటవీ అధికారులు నిస్సహాయంగా (negative emotion) చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా గూడూరు ప్రాంతంలో నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి ముందస్తు దాడులు నిర్వహిస్తారా? లేక మరోసారి చూసీచూడనట్లు వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది.

కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద అక్రమంగా తరలింపు జరగకుండా జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. తెల్లరాయి మైనింగ్‌కు అనుమతులు లేవు: క్రిష్ణవర్తి, ఏడీ, మైన్స్ పోలవరం (రంపచోడవరం) జిల్లాలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలో ఎక్కడా తెల్లరాయి తవ్వకాలకు అనుమతులు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం.