పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి
- లింగాపూర్ కుమ్మరి రంజిత్ కుమార్
కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికొంటూ నివారణ టీకాలు వేయించాలని లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ అన్నారు. శనివారం కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువుల ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ ప్రారంభించారు.
మండలంలోని పశువులకు దూడలకు ఆవులకు గేదెలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో కడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ పి సౌందర్య, గ్రామ ఉపసర్పంచ్ కమ్ముల లక్ష్మీ స్వామి, జిపి వార్డు సభ్యులు జేవిఓ జే రాజేశ్వర్, పశువైద్య సిబ్బంది విజయ హరీష్, రాజేశ్వర్, బి రమేష్, మల్లేష్, రైతులు పాల్గొన్నారు.
