చిన్నారిపై చిరుత దాడి

  • తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక


నంద్యాల బ్యూరో, ఆగష్టు 14 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా (Nandyal District) లోని నల్లమల్ల అడవిలో ఉన్న చిన్నారుట్ల గూడెం (Chinnarutla gudem) లో ఓ చిన్నారిపై చిరుత (leopard) దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు… శ్రీశైలంకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల గూడెంలో రాత్రి చిన్నారి బాలిక కుడుముల అంజమ్మపై చిరుత పులి దాడి చేసింది.

ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారిని ఓ చిరుత (leopard) ఎత్తుకెళ్తుండగా తల్లిదండ్రులు గమనించారు. తండ్రి అంజయ్య, బంధువులు కేకలు వేస్తూ కర్రలతో వెంబడించ‌డంతో చిరుత బెదిరి ఆ చిన్నారి అంజనమ్మను ముళ్ళపోదల్లో వదిలి పారిపోయింది. చిన్నారి బాలిక అంజనమ్మ (Anjanamma)కు అలా పొట్ట బాగాన తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అటవీశాఖ అధికారులకు విషయం తెలిపారు. వారు గూడేన్ని సందర్శించారు. ఇటీవల కాలంలో చిరుతలు పులులు, ఎలుగుబంట్లు జనాలు సంచరిస్తున్న‌ ప్రాంతాలకు రావటం విశేషం. గ్రామాల వైపు సంచ‌రించ‌డంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నరు. అటవీ శాఖ అధికారులకు తెలిపినా ఏం ప్రయోజనం లేదని బాధితులు వాపోతున్నారు.

Leave a Reply