ఉపాధి కూలీలకు సర్పంచ్ చేతుల మీదుగా అంబలి పంపిణీ..

ఉపాధి కూలీలకు సర్పంచ్ చేతుల మీదుగా అంబలి పంపిణీ..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని మద్దిపడగ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి కూలీలకు గ్రామ సర్పంచ్ పంజాల శకుంతల రామగౌడ్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంజాల శకుంతల మాట్లాడుతూ.. అంబలి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉపాధి కూలీలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
వడదెబ్బ బారిన పడకుండా తరచూ నీరు, మజ్జిగ, అంబలి తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ డి. రమణయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎస్. మౌనిక, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కె. శంకర్, ఉపాధి కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
