Hruthik roshan | సినిమా ఎవరితో…?

Hruthik roshan | సినిమా ఎవరితో…?

Hruthik roshan | టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన హృతిక్ రోషన్
గీతా ఆర్ట్స్ లో హృతిక్ మూవీ ప్లాన్
చందూ మొండేటి ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది?
హృతిక్ కోసం కథ సిద్ధం చేసిన డైరెక్టర్ బాబీ
చిరంజీవి సినిమా తర్వాత సెట్స్ పైకి హృతిక్ ప్రాజెక్ట్

Hruthik roshan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కో బాలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు (Movies) చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ పై మరింత ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ వార్ 2 అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ తో హృతిక్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు..?

Hruthik roshan | గీతా ఆర్ట్స్ లో..

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన సినిమాలు ఈమధ్య అంతగా ఆకట్టుకోకపోవడంతో ఇక నుంచి చేసే సినిమాల పై మరింత శ్రద్ధ పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే.. హృతిక్ టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ తో సినిమా గురించి ఇప్పటి నుంచి కాదు.. గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. వార్ 2 సినిమా కంటే ముందు నుంచి తెలుగు దర్శకుడితో హృతిక్ రోషన్ సినిమా అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ హృతిక్ తో సినిమా చేయాలి అనుకుంది. డైరెక్టర్ ఎవరంటే.. చందూ మొండేటి పేరు వినిపించింది. కానీ.. ఈ ప్రాజెక్ట్ వార్తలకే పరిమితం అయ్యింది.

Hruthik roshan | హృతిక్ కోసం బాబీ..

ఇప్పుడు హృతిక్.. తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి డైరెక్టర్ ఎవరంటే.. బాబీ పేరు వినిపిస్తుంది. అయితే.. ఇదేదో గాసిప్ అనుకుంటే.. పొరపాటే. ఎందుకంటే.. ఈ విషయాన్ని స్వయంగా కోన వెంకట్ ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. డైరెక్టర్ బాబీ (Bobby) హృతిక్ కోసం ఓ కథ రెడీ చేశారని.. ఆల్రెడీ కథ చెప్పడం.. ఆయన ఓకే చేయడం జరిగిందనే విషయాన్ని చెప్పారు. మరి.. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందంటే.. ప్రస్తుతం బాబీ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత హృతిక్ తో బాబీ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్. మరి.. ఇదే కనుక నిజమైతే.. హృతిక్ ని బాబీ ఎలా చూపిస్తాడో.. ఏ జోనర్ లో సినిమా చేస్తాడో చూడాలి.

Hruthik roshan

Leave a Reply