చైర్మన్ ను సత్కరించిన ట్రస్మా డివిజన్ కమిటీ

చైర్మన్ ను సత్కరించిన ట్రస్మా డివిజన్ కమిటీ
స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ను ట్రస్మా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సత్క రించారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్ లో కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా డివిజన్ అధ్యక్షులు ఉబ్బని మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు సంజీవరెడ్డి, డి. జోసఫ్, సరళ అరుణాచలం, బివి ఎం శివ ఉపాధ్యాయులు కే. నాగరాజు, మడికంటి శ్రీనివాస్, రాజు తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలలో ఉన్న సమ స్యలు, విద్యార్థుల సంఖ్య గత ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణత శాతం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. మీ పాఠ శాలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తేవాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చైర్మన్ వినయ్ ట్రస్మా సభ్యులకు హామీ ఇచ్చారు.
