Extensive searches | ఏపీ మద్యం కుంభకోణం..

Extensive searches | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ప్రధాన నిందితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ కీలక ఆధారాల కోసం శోధిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి తదితరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.
సిట్ నివేదిక ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది. సోదాల్లో కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుందని సమాచారం.
