Encounter | ఝార్ఖండ్ లో ఎన్ కౌంట‌ర్ – టాప్ లీడ‌ర్ తో స‌హా ముగ్గురు న‌క్స‌లైట్లు మ‌ర‌ణం

రాంచీ – ఝార్ఖండ్ లో శనివారం లతేహార్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతో స‌హా మ‌రో ఇద్ద‌రు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం .. ఇచాబార్‌ అడవిలో ని లతేహార్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఝార్ఖండ్ జాన్ ముక్తి పరిషత్ (జేజేఎంపీ) అగ్రనాయకుడు పప్పు లోహ్రా మరణించాడు. అతడిపై ఇప్పటికే రూ.10లక్షల రివార్డు ఉంది. పప్పు సహాయకుడు ప్రభాత్ గుంజు కూడా హతమయ్యాడు. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ఈ కాల్పుల్లో మరో మావోయిస్టు మృతి చెంద‌గా, మ‌రోరికి గాయాలయ్యాయి. అతడిని అరెస్టు చేసి.. ఒక రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply