Electric motor | గ్రామసభ వాయిదావేస్తూ ఏకగ్రీవ తీర్మానం….

Electric motor | గ్రామసభ వాయిదావేస్తూ ఏకగ్రీవ తీర్మానం….
Electric motor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ ఇన్చార్జి కార్యదర్శి అశోక్ గౌడ్, గ్రామపంచాయతీ రికార్డులు సమర్పించకపోవడంతో సోమవారం నిర్వహించిన గ్రామసభ సభ్యులందరూ ఏకగ్రీవంగా వాయిదా వేస్తూ పాలకవర్గం సభ్యులుతీర్మానంచేపట్టారు. ఈ సందర్భంగా ఓబులాపూర్ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఎంపికైన తర్వాత తమ గ్రామానికి ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్ గ్రామపంచాయతీ రికార్డులు సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఉపాధి హామీ పనులు, వివిధ అభివృద్ధి పనులకు సహకరించడం లేదని ఆరోపించారు. ప్రత్యేక అధికారుల పాలనలో చేపట్టిన తీర్మానాలు, రికార్డుల వివరాలు తమకు సమర్పించాలని డిమాండ్ చేశారు. గ్రామసభకు ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్ హాజరు కాకుండా తమ గ్రామ పంచాయతీ రికార్డులు సమర్పించకపోవడంతో గ్రామసభను ఏకగ్రీవంగా వాయిదా వేస్తున్నట్లు తీర్మానించినట్లు తెలిపారు. సభ్యులు ఏకపక్షంగా తీర్మాన్నించడంతో గ్రామసభ వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి లక్ష్మీదేవి ప్రకటించారు.అనంతరం గ్రామంలోని విద్యుత్ మోటార్ చేతిపంపు మరమ్మతు పనులు పరిశీలించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, హన్మంతు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మిదేవి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
