Earthquake | ట‌ర్కీలో భూకంపం – రిక్ట‌ర్ స్కేల్ పై 6.2 తీవ్ర‌త న‌మోదు

టర్కీలో భూకంపం అలజడిని సృష్టించింది. టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం రోడ్స్ నుండి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల (42 మైళ్ళు) లోతులో సంభవించిందని తెలిపింది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం.

స్థానిక అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.. అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.

Leave a Reply