ద‌స‌రా ఆదాయం రూ.10.30 కోట్లు..

  • 387 గ్రాముల బంగారం, వెండి 19.450 కేజీలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ తల్లికి కనక వర్షం కురిసింది. ఈ ఉత్సవాలకు తరలి వచ్చిన లక్షలాది మంది కనక దుర్గమ్మకు బంగారం, వెండి, స్వదేశీ కరెన్సీ సహా విదేశీ డాలర్లను కానుకలుగా సమర్పించారు.

ఈ 11 రోజుల దసరా ఉత్సవాల తరువాత మూడు రోజులు అత్యధికంగా భవానీలు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని హుండీలన్నింటినీ దేవస్థానం అధికారులు లెక్కించారు. ఆలయంలోని మహా మండపం ఆరవ అంతస్తులో సోమ, మంగళవారాల్లో తెరచి కానుకలను లెక్కించారు.

ఆలయంలోని 56 హుండీలు, 243 బ్యాగులను తెరచారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శీనా నాయక్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. రూ 10,30,95,521లు నగదు , 387 గ్రాముల బంగారం, 19 .450 కిలోల వెండి ఆభరణాలను భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

విదేశీ డాలర్లు, కేశఖండన, దర్శన టిక్కెట్లు, ప్రత్యేక పూజ టికెట్లు ఇలా అన్ని విధాలుగా ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే పెద్ద ఎత్తున సమకూరింది. గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా హుండీ లెక్కింపులో రూ 9,32,94,018లు నమోదు కాగ.. ఈ ఏడాది వీటికి అదనంగా మరో కోటి రూపాయల అదనపు ఆదాయం లభించింది. ఈ ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా సుమారు రూ 15 కోట్ల పైగా జరిగింది.

Leave a Reply