Don3film | ధురంధర్ హీరో పై సంచలన నిర్ణయం..

Don3film | ధురంధర్ హీరో పై సంచలన నిర్ణయం..
Don3film | FWICE తీసుకున్న కఠిన నిర్ణయం
‘సహాయ నిరాకరణ’ ఆదేశాలు అమలు
‘డాన్ 3’ వల్ల భారీ నష్టం ఆరోపణలు
బాలీవుడ్‌లో హాట్ టాపిక్గా మారిన వివాదం
Don3film | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంచలన నిర్ణయం తీసుకుంది. క్రేజీ ఫ్రాంచైజీ చిత్రం డాన్ 3 నుంచి రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం పై దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం FWICE ఈ కఠిన చర్యలకు దిగింది. తాజా ఆదేశాల ప్రకారం.. రణవీర్ సింగ్ ఈ వివాదం పై స్పందించి చర్చలకు వచ్చేంత వరకు ఆయనతో పరిశ్రమకు చెందిన ఏ సభ్యుడూ కలిసి పని చేయకూడదని సంఘం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
Don3film | సహాయ నిరాకరణ..
ఈ వ్యవహారంపై FWICE అధ్యక్షుడు బి.ఎన్. తివారీ అధికారికంగా స్పందిస్తూ, సహాయ నిరాకరణ నోటీసు తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రణవీర్ సింగ్ స్వయంగా ముందుకు వచ్చి అంశం పై తగిన వివరణ ఇచ్చేంత వరుకు ఏ ఒక్క టెక్నీషియన్, నటుడు, సినీ కార్మికుడు కూడా ఆయనకు సహకరించబోరని నొక్కి చెప్పారు. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ కాపాడటానికే ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని FWICE ప్రతినిధులు పేర్కొన్నారు.

Don3film | 45 కోట్లు నష్టం..
మరో వైపు, డాన్ 3 చిత్రం ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఉండగా, ఈ వివాదం సినిమా పై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రణవీర్ హఠాత్తుగా తప్పుకోవడం వల్ల 45 కోట్ల రూపా యల మేర నష్టం వాటిల్లిందని సదరు నిర్మాణ సంస్థ ఆరోపించింది. రణవీర్ సింగ్ నుంచి వచ్చే స్పందన పై ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రణవీర్ సింగ్ వైపు ఉన్న వాదనలను వినడానికి వారి మధ్య మనస్పర్థలను తొలగించి ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ ప్రకటనలో వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న రణవీర్ సింగ్ కెరీర్‌లో ఇలాంటి పెద్ద వివాదం ఎదురుకావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ వివాదం రణవీర్ ఇతర ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? ఈ వివాదం పరిష్కారం అవుతుందా..? లేదా..? రణ్ వీర్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

CLICK HERE TO READ Chand Mera Dil | అనన్యపై నెటిజన్ల సెటైర్ల వర్షం..
