Delhi | ఎక్కడంటే….

Delhi | ఎక్కడంటే….
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పది పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఈ మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. వెంటనే డాగ్ స్క్వాడ్స్తో కలిసి బాంబు డిస్పోజల్ విభాగం ఆయా ప్రాంతాలకు చేరుకుని చెక్ చేస్తున్నట్లు డీఎఫ్ఎస్ అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలను ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
