భవిష్యత్ తరాల కోసమే నా తాపత్రయం

భవిష్యత్ తరాల కోసమే నా తాపత్రయం

  • రోడ్డు వెడల్పు నా స్వార్థం కోసం కాదు
  • ప్రధాన రహదారి 80 ఫీట్లు
  • గోదావరి రోడ్ 40 ఫీట్లు
  • పాడి పరిశ్రమకు పెద్దపీట వేస్తాం
  • చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడి

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : భవిష్యత్ తరాల కోసమే రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఐబీ విశ్రాంత భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రధాన రహదారి వెడల్పు 80 ఫీట్లుగా నిర్ధారించారన్నారు. దీనిలో సెంట్రల్ లైటింగ్ కు 4 ఫీట్లు, ఫుటపాత్ కు ఇరువైపులా 3 ఫీట్ల చొప్పున 6 ఫీట్లు పోగా 70 ఫీట్ల రోడ్డు ఉంటుందన్నారు.

ప్రజలకు నష్టం జరుగకుండా చేయడానికే 80 ఫీట్లు రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా గోదావరి రోడ్ కు వెళ్లే దారిలో సర్కిల్ వద్ద 100 మీటర్ల వరకు 50 ఫీట్ల రోడ్డు కొలతలు చేసి, మిగిలిన దానిని 40 ఫీట్లు చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా పట్టణీకరణ ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయని వివరించారు. మంచిర్యాల లో అదే విధంగా జరిగిందని పలు ఉదాహరణలతో వివరించారు. రాబోయే 3,4 తరాల భవిష్యత్ ను నిర్మించడమే తన ధ్యేయమన్నారు.

డైయిరీ పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. రైతాంగానికి మూడు దఫాలుగా సాగునీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. మహాలక్ష్మి వాడ, ఇటిక్యాల, ఆంధ్ర భోర్ రోడ్ల ను వెడల్పు చేయనున్నట్లు తెలిపారు. కొందరు నియోజకవర్గం పునర్ వైభవం అంటూ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇన్ని ఏండ్లు అధికారంలో ఉండి ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు?

తాను చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తానని, భవిష్యత్ తరాలకు తన పేరు గుర్తుకు ఉండేలా మార్క్ ను చూపుతానని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రమాణ స్వీకారం చేసిన కో – ఆప్షన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలీ – నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి – వెంకటస్వామి గౌడ్, నాయకులు నాగభూషణం, ఆరీఫ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply