బస్టాండ్ వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయాలి

బస్టాండ్ వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయాలి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలో హైవే – 65 విస్తరణలో భాగంగా ఫ్లై ఓవర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేసి బస్టాండ్ దగ్గర వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. చౌటుప్పల్లో బుధవారం పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు జిల్లా రాష్ట్ర నాయకులు మాట్లాడారు. జాతీయ రహదారుల రీజినల్ ఆఫీసర్ శివశంకర్ కు బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయగా స్పందించిన ఆర్ ఓ ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలంటే ఓ వర్గం సమాధులు అడ్డుగా ఉన్నవని తెలిపారు.

వెహికల్ అండర్ పాస్ నిర్మాణం చేయడానికి సిద్ధమని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న ఓ వర్గం సమాధులకు పరిహారం డబ్బులు తీసుకున్నప్పటికీ ఆ వర్గం సమాధులను తొలగించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది సున్నితమైన అంశమని, రోడ్డు నిర్మాణం పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుందని బిజెపి నాయకులు ఖండించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల గత రెండు సంవత్సరాల నుండి ఫ్లైఓవర్ నిర్మాణంలో కాలయాపన జరుగుతుండడం వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుచున్నారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మైనార్టీ సోదరులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి పూర్వపు కొలతల ప్రకారం రోడ్డు నిర్మాణం చేయాలని బిజెపి నాయకులు కోరారు.

గతంలో రోడ్డు వెడల్పులకు నష్టపరిహారం సుమారు కోటి రుపాయలకు పైగా తీసుకున్నారు, అదనపు స్థలం కూడా తీసుకున్న విషయం ప్రజలందరికి తెలుసని, అయినా నేటికీ మైనార్టీల అక్రమ కట్టడాలను తొలగించకపోవడం సిగ్గుచేటని, ఈ అక్రమ కట్టడాలు తొలగించకపోవడం వల్ల సర్వీసు రోడ్డు లేక లక్కారం నుండి చౌటుప్పల్ కి వచ్చే ప్రజలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, చాలా మంది గాయాలపాలైనారని, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, అధికారులు ఎవరు స్పందించలేదన్నారు. ఇలాంటి సున్నితమైన ప్రజా సమస్యలపై బిజెపి ఎప్పుడు పోరాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ప్రజా ఉద్యమాలు చేస్తుందని, రోడ్డు వంతెన నిర్మాణం విడితి సుమారు 200 మీటర్లు తగ్గటంతో ఆ కోట్లాది రూపాయలు ఏమవుతున్నవని వారు ప్రశ్నించారు.

గతంలో సర్వీసు రోడ్డు నిర్మాణం, సర్వీస్ రోడ్డు వెంట ఉండే డ్రైనేజీల నిర్మాణం నాణ్యత లేకుండా ఆశాస్త్రీయంగా పూర్తి చేశారని, సర్వీసు రోడ్లు ఉన్న విడితిని తగ్గించి అండర్ గ్రౌండ్ నిర్మాణం చేశారని, గతంలో బిజెపి ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు. ఆనాడు చేసిన పొరపాటుకు పట్టణంలోని వ్యాపారులు ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందుల గురవుతున్నారు. వ్యాపారాలు సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ అవినీతిలో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు?
గతంలో ఈ అవినీతిపై అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన పార్టీ బిజెపినే అన్నారు.

చౌటుప్పల్ పట్టణంలో అండర్ పాస్ నిర్మాణం అయ్యేంతవరకు పూర్వపు కొలతల ప్రకారం హైవే పై వంతెన నిర్మాణం జరిగే వరకు ప్రజల పక్షాన బిజెపి పోరాడుతుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్. 2వ వార్డ్ కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మి, కడారి ఐలయ్య, పోలేపల్లి ముత్తయ్య, వంగల రమాకాంత్, కానుగు శేఖర్, పర్నే శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply