Valuable | రూ.1,150 కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత

Valuable | రూ.1,150 కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత
Valuable | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : గుజరాత్ లోని కచ్ తీరంలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. పాకిస్థాన్‌లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకపై గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. దాదాపు రూ.1,150 కోట్ల విలువైన 115 కిలోలకుపైగా కొకైన్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. మాదకద్రవ్యాల సరఫరా నెట్వర్క్, అంతర్జాతీయ సంబంధాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
