CM Revanth Reddy | మీరు సూచనలు అప్పుడే ఇవ్వండి…

CM Revanth Reddy | మీరు సూచనలు అప్పుడే ఇవ్వండి…
CM Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ చేసిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. అసెంబ్లీ సభలో సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని విమర్శించారు.సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పగిస్తే 48 గంటల్లోనే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావును జైలులో వేస్తామని తెలిపారు. ఇప్పుడు కేసు అప్పగించి నెలలు గడుస్తున్నా సీబీఐ విచారణ ముందుకు పోలేదని అన్నారు.ఢిల్లీలో కేసును అణగదొక్కి, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు పంచుకున్నారని బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సభలో బీజేపీ నేతలు సలహాలు ఇచ్చే ముందు కాళేశ్వరం కేసు ముందుకు సాగేలా కేంద్రాన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అన్నారు.
పారదర్శకత కోసమే తాము ఈ కేసును సీబీఐకి అప్పగించామని ఆయన పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి చెప్పే ధైర్యం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి లేదా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ చర్యలు తీసుకునేలా చూసిన తర్వాతనే వెంకట రమణారెడ్డి సభలో సలహా ఇవ్వాలని అన్నారు. పారదర్శకత కోసమే తాము కేసును సీబీఐకి అప్పగించామని మళ్లీ స్పష్టం చేశారు.
సభలో సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ నేతల గుణంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ వేయకపోవడం వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.
