చౌటుప్పల్, మార్చి 6 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ ఏడీ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడిచేసి ఓ పరిశ్రమ యజమాని నుండి రూ.70వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమ యాజమాని నుండి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్ రూ.70వేలు లంచం తీసుకొని చూసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.