రిచ్ మాండ్ సిటీలో అంబరాన్నంటిన సంబరాలు

రిచ్ మాండ్ సిటీలో అంబరాన్నంటిన సంబరాలు

వెబ్ న్యూస్, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ (Bathukamma) సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలోని తెలంగాణ ప్రజలు, వివిధ సంఘాలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. యూఎస్ లోని రిచ్ మాండ్ లో గ్రేటర్ రిచ్ మాండ్ సిటీ తెలుగు అసోసియేషన్ (Richmond City Telugu Association) ఆధ్వర్యంలో తొలి రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

తీరొక్క పూలతో బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడింది. ఎంగిలిపూల పండుగ సందర్భంగా బతుకమ్మలను పూలతో బతుకమ్మ(Bathukamma) లను అందంగా అమర్చి, గౌరీదేవిని పూజిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో పండుగను నిర్వహించారు. తెలంగాణ లోని పల్లెల్లో ఎలాగైతే బతుకమ్మను జరుపుకుంటారో, అదే విధంగా ఇక్కడ కూడా పూలను పేర్చి, బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. తమ సంస్కృతిని, వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ఈ పండుగను నిర్వహిస్తూ వస్తున్నామని ఇక్కడి తెలుగు ప్రజలు గర్వంగా చెబుతున్నారు.

Leave a Reply