Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు..

Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు..

Bjp l నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా లోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వేలసిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శివ మాలదారులపై నాటి చార్జి చేయటం తగదని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బిజెపి నాయకులు తెలుపుతున్నారు. శ్రీశైలంలో శివ మాలధారులపై అడిషనల్ ఎస్పీ లాఠీఛార్జ్ చేయడాన్ని మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. సరైన వసతులు మంచినీరు బిస్కెట్లు తిండి పదార్థాలు లేకుండా వారిని ఆకలికి మార్చివేసి పైగా వారిపై పోలీసులు అమానుషంగా లాటిచార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

శైవభక్తుల పట్ల సంయమనం పాటించాలని అధికారులకు హితవు పలికారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.మాలధారణ చేసిన భక్తులు శ్రీశైలంలో ఇరుముడులు సమర్పిస్తారు.వారికి సహకరించాల్సిన యంత్రాంగం సంయమనం కోల్పోతే ఎలా? అని మాధవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇరుముడులతో వచ్చినటువంటి శివ సైనికులు భక్తుల పట్ల అధికారులు పోలీసులు అప్రమత్తంగా సమయంతో పాటించి వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply