Bihar | నితీశ్ పదోసారి..

Bihar | నితీశ్ పదోసారి..
Bihar, పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించిన తర్వాత, జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) బీహార్ ముఖ్యమంత్రిగా మరికొద్ది గంటల్లో 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 243 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏ 202 స్థానాలు సాధించింది. దీనిలో బీజేపీ 89, జేడీ(యూ) 85 స్థానాలు గెలుచుకుంది. దీంతో సుశాసన్ బాబుగా పేరొందిన నితీశ్ కుమార్ రాజకీయ ప్రాముఖ్యత మరింత బలపడింది. కుర్మీ కులానికి చెందిన నితీశ్ కుమార్ 1951, మార్చి 1న జన్మించారు. రాష్ట్ర రాజకీయాల్లో 50 సంవత్సరాల అనుభవం కలిగిన నాయకుడిగా నిలిచారు.
ప్రమాణ స్వీకారం వివరాలు..
నవంబర్ 20న సుమారు ఉదయం 11:30 గంటలకు పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్లో సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఈ మైదాన్ నవంబర్ 17 నుండి 20 వరకు ప్రజలకు మూసివేయబడింది. భద్రతా ఏర్పాట్లు పూర్తి పారదర్శకతతో జరుగుతున్నాయి. నితీశ్తో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 2000లో అప్పటి గవర్నర్ వీసీ పాండే ఆయనతో మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ (Modi) పాల్గొంటారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జెపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఎన్డీఏ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమం త్రులు, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, జేడీ(యూ) నాయకులు లలన్ సింగ్, సంజయ్ ఝా వంటివారు హాజరవుతారు. నిర్వాహకుల అంచనా ప్రకారం 2-3 లక్షల మంది ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. నవంబర్ 17న నితీశ్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అసెంబ్లీ, మంత్రివర్గం రద్దుకు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఒక తీర్మానాన్ని చేసింది. సదరు తీర్మానాన్ని గవర్నరు నితీశ్ వ్యక్తిగతంగా అందజేశారు.
అనంతరం పాట్నాలో జరిగిన ఎన్డీఏ (NDA) శాసనసభాపక్షం సమావేశం లో సభాపక్ష నాయకుడిగా నితీశ్ కుమార్ను ఎన్నుకున్నా రు. సమావేశానికి బీజేపీ అబ్జర్వర్లు వినోద్ తావే, ధర్మేం ద్ర ప్రధాన్ హాజరయ్యారు. 19న ప్రస్తుత ముఖ్య మంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. క్యాబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 35గా ఉండే అవకాశం ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలు ఇటీవల కుదుర్చు కున్న ఒప్పందంలో భాగంగా బీజేపీకి 16 మంత్రి పదవులు, ఇందులో 2 ఉప ముఖ్యమంత్రులు (విజయ్ కుమార్ సిన్హా, సంరామ్ చౌదరిలకు అవకాశం), జేడీ (యూ)కు 14, ఎల్డీపీ (రామ్ విలాస్)కు 3 (చిరాగ్ పాశ్వా న్ పార్టీ). హెచ్ఎం(ఎస్)కు 1 (జీతన్ రామ్ మంజీ పార్టీ). ఆర్ఎల్ఎంకు 1 మంత్రి పదవి (శాసరామ్ నుండి ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత గెలిచారు). బీజేపీకి హోం, ఆర్థికం, జేడీ(యూ)కు గ్రామీణాభివృద్ధి, రవాణా వంటి ముఖ్యమైన పోర్ట్ ఫోలియోలు కేటాయించవచ్చునని సమాచారం.
మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి
https://epaper.prabhanews.com
