Bank Holidays | జులై 2025 బ్యాంకు సెలవుల జాబితా – పూర్తివివరాలు ఇక్కడే !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన ప్రకారం వచ్చే నెల (జులై 2025)లో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ ఉత్సవాలు, పండుగలపై ఆధారపడి ఉన్న ప్రత్యేక సెలవులు. కాబట్టి బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

జులై 2025 బ్యాంక్ సెలవుల తేదీలు :

  • జులై 3 (గురువారం) – కరాచీ పూజ-త్రిపుర
  • జులై 5 (శనివారం) – గురు హర్గోబింద్ జయంతి-జమ్మూ, శ్రీనగర్
  • జులై 6 (ఆదివారం) – వారాంతపు సెలవు-అన్ని రాష్ట్రాలు
  • జులై 12 (శనివారం) – రెండో శనివారం-అన్ని రాష్ట్రాలు
  • జులై 13 (ఆదివారం) – వారాంతపు సెలవు-అన్ని రాష్ట్రాలు
  • జులై 14 (సోమవారం) – బెహదీన్‌ఖ్లామ్-మేఘాలయా
  • జులై 16 (బుధవారం) – హరేలా పండుగ-ఉత్తరాఖండ్
  • జులై 17 (గురువారం) – యూ టైరాట్ వర్థంతి-మేఘాలయా
  • జులై 19 (శనివారం) – కెర్ పూజ-త్రిపుర
  • జులై 20 (ఆదివారం) – వారాంతపు సెలవు-అన్ని రాష్ట్రాలు
  • జులై 26 (శనివారం) – నాలుగో శనివారం-అన్ని రాష్ట్రాలు
  • జులై 27 (ఆదివారం) – వారాంతపు సెలవు-అన్ని రాష్ట్రాలు
  • జులై 28 (సోమవారం) – డ్రూక్పా టెషీ పండుగ-సిక్కిం

సెలవు రోజుల్లో బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉంటే కూడా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఏటీఎం ద్వారా నగదు లావాదేవీలు, UPI సేవలు (PhonePe, Google Pay, Paytm వంటివి) సేవలతో ఎలాంటి అంతరాయం లేకుండా ఆర్థిక లావాదేవీలు కొనసాగించవచ్చు.

పై జాబితా ఆర్‌బీఐ జారీ చేసిన ప్రాథమిక షెడ్యూల్ ఆధారంగా ఉంది. ప్రాంతీయ సెలవులు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడవచ్చు, కావున తదుపరి మార్పుల కోసం RBI అధికారిక వెబ్‌సైట్ లేదా స్థానిక బ్యాంక్ నోటిఫికేషన్లను పరిశీలించండి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఈ లిస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుగానే మీ బ్యాంకింగ్ పనులను ప్లాన్ చేసుకోండి!

Leave a Reply