ఎంవీ కృష్ణారావుకు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాళి..

ఎంవీ కృష్ణారావుకు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాళి..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి ఎంఎం పల్లంరాజు నివాళులు అర్పించారు. గురువారం ఒక ప్రైవేట్ కార్యక్రమానికి అవనిగడ్డ వచ్చిన ఆయన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి పురస్కరించుకొని అవనిగడ్డ వంతెన సెంటరులో కృష్ణారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.
