- పూడిచెర్లలో ఫారంపాడ్స్ నిర్మాణంకు భూమిపూజ
- బహిరంగ సభలో ప్రసంగం
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు (శనివారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌కు పవన్ చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి పూడిచెర్ల చేరుకుంటారు.
పూడిచెర్లలో ఫారంపాండ్స్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రైతు సూర రాజన్న పొలంలో ఫారం పాండ్‌కు భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని శుక్రవారం కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్.
ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. కాగా, పూడిచర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయల్దేరి వెళ్లనున్నారు.