పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనర్ గా 2000 అంబర్ కిషోర్ ఝాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ ను రామగుండంకు రామగుండం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన శ్రీనివాసులును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న గౌస్ ఆలంను కరీంనగర్ సీపీగా బదిలీ చేశారు. 2009 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ ఝా మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగాను 2012 వరంగల్ ఓఎస్డి, అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేసి తెలంగాణ ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా పనిచేసి కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. డీఐజీగా పదోన్నతి పొందిన అంబర్ కిషోర్ ఝా రాచకొండ జాయింట్ సీపీగా పనిచేశారు. ఎడాది నుండి వరంగల్ సీపీగా పనిచేస్తున్నారు.