Airport | విమాన రాకపోకలకు అంతరాయం..

Airport | విమాన రాకపోకలకు అంతరాయం..

Airport | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు బయలుదేరాల్సిన ఓ విమానం రన్‌వేపై నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

విమానాన్ని వెంటనే తరలించే చర్యలు చేపట్టిన అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనతో రన్‌వేపై కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో విమాన రాకపోకలు ప్రభావితమయ్యాయి.

ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన రెండు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే టేకాఫ్ కావాల్సిన మరో మూడు విమానాలు ఆలస్యంగా బయలుదేరినట్లు సమాచారం.

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.

Leave a Reply