రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు…

రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు…

గట్టుప్పల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం వ్యవసాయంలో అవలంబించవలసిన నూతన వ్యవసాయ పద్దతులు, నూతన వంగడాలు,నకిలీ పత్తి విత్తనాల గురించి, ఇతర పంటలపై సోమవారం రైతు వేదికలో ఉదయం 9 గంటలకు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రేవతి తెలిపారు.

అలాగే రైతులు శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రామకృష్ణ బాబు, శాంతి ప్రియ, లింగయ్య పాల్గొననున్నారని తెలిపారు. కావున రైతులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు.

Leave a Reply