మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి..

కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఓలా గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు ఓలా గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓలా గ్రామంలో అత్యధికంగా ఏడాది మొక్కజొన్న విస్తీర్ణము పెరిగిందని కావున ఓలా గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలి అన్నారు. ప్రభుత్వం ద్వారా గిట్టిబాటు ధర కలిగేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఓలా గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మార్కెట్ అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి, సీనియర్ నాయకులు జీవి రమణారావు, మాజీ సర్పంచ్ గజ్జరం, మాజీ ఉప సర్పంచ్ సదాశివ్ పటేల్, సాదు ప్రభాకర్, రాజన్న, దేవిదాస్, కంబోలి చిన్నన్న, శ్యామ్ రావు, ఎగ్జామ్ నర్సింలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply