A.Kondur | పి హెచ్ సి లో పోలియో చుక్కలు..

A.Kondur | పి హెచ్ సి లో పోలియో చుక్కలు..

  • ఎ.కొండూరు మండలంలో 98 శాతం పల్స్ పోలియో

A.Kondur | ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ. కొండూరు మండలంలో 98 శాతం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు ఎ. కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వేములకొండ స్వాతి, డాక్టర్ పి.దివ్య తెలిపారు. ఆదివారం ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 0-5 సంవత్సరంలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని తహసీల్దార్,కె.లక్ష్మీ ఎంపీడీవో బొజ్జగాని శ్రీనివాసరావు డాక్టర్ స్వాతి, డాక్టర్ దివ్య ప్రారంభించారు.

మండలంలోని 21 గ్రామపంచాయతీలు,16 శివారు గ్రామాలు తండాలలో3,112 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని,2,997 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.బస్సుల్లో, కార్లలో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా తమ పిల్లలను ఎ. కొండూరు మండల కేంద్రంలో పోలియో చుక్కలు వేయించినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 36 కేంద్రాలు, ఒక మొబైల్ టీం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామాల్లో మిగిలిన రెండు శాతం పిల్లలకు 22,23 తేదీలలో ఏఎన్ఎంలు,ఆషా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని సర్పంచులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ పీటర్, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply