Nagarkurnool | వివేకానందుడి స్ఫూర్తితో…

Nagarkurnool | వివేకానందుడి స్ఫూర్తితో…

  • సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ‌ నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… స్వామి వివేకానంద సూక్తులు, ఉపన్యాసాలు ప్రపంచ నలుమూలలా వ్యాపించాయని చెప్పారు. యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. 1984లో భారత ప్రభుత్వం స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, జిల్లా యువజన సర్వీసు క్రీడల శాఖ అధికారి సీతారాం నాయక్, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్, జిల్లా అధికారులు డీఈఓ రమేష్ కుమార్, నర్సింగ్ రావు, చిన్న ఓబులేష్, శ్రీరాములు, అరుణ రెడ్డి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply