TG | బాకీ కార్డుల పంపిణీ…

TG | బాకీ కార్డుల పంపిణీ…
TG | చిట్యాల, ఆంధ్రప్రభ : రెండున్నర సంవత్సరాల కాలంలో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి ఏం జరగలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాకీ ఉన్న మొత్తాన్ని క్లుప్తంగా వివరిస్తూ పుర ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చిట్యాల పట్టణానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని, అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలకు సంబంధించిన ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని హుటాహుటిన ఎంపీ, ఎమ్మెల్యేలు హడావుడిగా శంకుస్థాపన చేశారని విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చిట్యాల పట్టణానికి 25 కోట్లు నిధులు రాగా పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను, సిసి రోడ్లను నిర్మించామన్నారు. చిట్యాల పట్టణంలో వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించామన్నారు. రెండు కోట్ల 80 లక్షలతో చిట్యాల పట్టణాన్ని అభివృద్ధి పరిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము మంజూరు చేసిన పనులకు నిన్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు అని రెండేళ్ల నుండి చేయని శంకుస్థాపనలు నిన్ననే చేయడంలో ఆంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గ్రహించాలి అని, ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు ఈ శంకుస్థాపనల డ్రామాలు చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులకు శంకుస్థాపనలు చేయడం కాదు కొత్తగా పనులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ మోసాలను గ్రహించాలి, మీ పక్షాన నిలబడే వ్యక్తులను గెలిపించాలని పట్టణ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం లక్ష్మయ్య, మెండే సైదులు, కూరెళ్ల లింగస్వామి, కందటి రమేష్ రెడ్డి, ఆగు సైదులు, జిట్ట శేఖర్, పోకల రాములు, బో లుగూరు సైదులు, చిత్రగంటి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
