Cricket competitions | మౌలిక వసతుల కల్పన…

Cricket competitions | మౌలిక వసతుల కల్పన…

Cricket competitions | కుంటాల, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని వెనకబడిన మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం కుంటాల మండలం అంబుగాం గ్రామంలో ఆయన పర్యటించారు. స్థానిక సర్పంచ్ జాదవ్ శివాజీ విగ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్ పోటీల(Cricket competitions)ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ… విద్య ఉద్యోగ ఉపాధి వైద్యం రోడ్డు తాగునీరు తదితర మౌలిక వసతులు పై ప్రత్యేక దృష్టి పెడతానని సమస్యలను దశలవారీగా పరిష్కారం చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అంబుగాం గ్రామంలోని గత కొన్నేళ్లుగా దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న సమస్యలను ఏడాదిలోపు పూర్తి చేస్తానని తెలిపారు.

స్థానిక సర్పంచ్ శివాజీ ఎమ్మెల్యే కు ఏ కరువు పెట్టారు దీంతో స్పందించిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఓలా నుండి అంబుగాం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని గతంలో పదేళ్ల హయాంలో అభివృద్ధి జరగలేదని టెండర్లు సైతం పూర్తయ్యాయని త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేసి రహదారి పూర్తయ్య కృషి చేస్తానని పేర్కొన్నారు. రహదారి పూర్తయినప్పటికీ అటవీ శాఖ అధికారుల అడ్డంకి తో రోడ్డు నిలిచిపోయిందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను అటవీశాఖ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి తారు.

రోడ్డు నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు కృషి చేస్తానని పేర్కొన్నారు. తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి మూడు కోట్లకు పైగా నిధులు మంజూరైనట్టు తెలిపారు. అదే విధంగా మహారాష్ట్రకు అనుబంధ గ్రామాలైనటువంటి అంబుగాం నుండి పాంగర్ పాడు తో పాటు రంగా శివుని గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

Cricket competitions |

అనంతరం పలువురు గ్రామస్తులు తమ గ్రామానికి అద్వానంగా రహదారి ఉండటం మూలంగా బస్సు రాకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం వెళ్తున్నారని అయితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని అంతేకాకుండా ఏదైనా అత్యవసర సమయంలో అంబులెన్స్ రావాలన్న తమ గ్రామానికి రావడంలేదని మేదన్ పూర్ వరకు అంబులెన్స్ వస్తే ప్రైవేట్ వానలు వచ్చి అంబులెన్స్ లో పేషెంట్ ను అంబులెన్స్ కు చేరవేస్తున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

అంతర్గతంగా నిలిచిపోయిన పంచాయతీ భవనంతో పాటు ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు దశలవారీగా అభివృద్ధికి సహకరిస్తానని తెలియజేశారు. అనంతరం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను గ్రామస్తులు ముందుగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఆహ్వానించారు అనంతరం ఘనంగా సత్కరించారు.

దేవాలయాల అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తా

ముధోల్ నియోజకవర్గం లోని దేవాలయాల అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. విట్టాపూర్ గ్రామంలోని గల పోచమ్మ ముత్యాలమ్మ మహాలక్ష్మి ఆలయాలను ఆయన పరిశీలన చేశారు గత మూడేళ్ల నుండి అసంపూర్తిగా ఆగిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ కు వేగవంతంగా పనులు చేపట్టాలని అల సత్యం చేస్తే సహించేది లేదని ఫిబ్రవరి లోపు పూర్తయ్యాల చర్యలు చేపట్టాలని పనులు అసంపూర్తిగా చేపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత కాంట్రాక్టర్ ల నిర్లక్ష్య మూలంగా పనులు ఆగిపోతున్నాయని పనులు వేగవంతానికి కృషి చేయాలని దేవాలయాల అభివృద్ధికి మూడో నియోజకవర్గంలోని అత్యధికంగా నిధులు మంజూరు చేసిన ఘనత తనదేనని పేర్కొన్నారు.

మరింత దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు విట్టాపూర్ గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్ తో పాటు వీడీసీ సభ్యులు గ్రామస్తులు శివాలయం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా నిధులు మంజూరు చేస్తానని తాను నిరంతరం గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అల్లాడి వనజ సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సిందే లింగారం పటేల్ జాదవ్, శివాజీ హిమ్మత్ రావు, పటేల్ పిప్పర వెంగల్ రావు, ఆదముల రవి, మహేందర్, బాజీరావు, సదాశివ పటేల్, ఎగ్జామ్ గజ్జరం తో పాటు పలువురు బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply