PDSU | పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడిగా అజయ్.

PDSU | పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడిగా అజయ్.
PDSU | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన యువకుడు వరంగల్ జిల్లా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పీడీఎస్యు వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజయ్ తెలిపారు. పెద్ద పోర్ల గ్రామానికి చెందిన బి. అజయ్ ఊట్కూర్ మండలంలోని మొగ్ధంపూర్ గ్రామంలో ప్రైమరీ హైస్కూల్లో చదువుకొని హైస్కూల్, ఇంటర్ ఊట్కూర్ మండలంలో పూర్తిచేసుకుని మక్తల్ డివిజన్ కేంద్రంలో తిరుమల ఐటీఐ కళాశాలలో అడ్మిషన్ వేసి ఐటీఐ పూర్తి చేశారు.
తర్వాత అదే ప్రాంతంలో సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీని పూర్తి చేసుకున్నాడు. అదే క్రమంలో మక్తల్ ప్రాంతంలో పీడీఎస్యు విద్యార్థి సంఘాన్ని ఆ ప్రాంతంలో బలోపితం చేశాడు. నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ జిల్లాలో అనేక ఉద్యమాలను చేపట్టారు. హాస్టల్ సమస్య(hostel problem)ల పైన, పాఠశాలల సమస్యల పైన, కళాశాలల సమస్యల పైన, అనేక ఉద్యమాలను ఆ ప్రాంతంలో చేశారు. మక్తల్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో క్రియాశీలక ఉద్యమాలల్లో పాల్గొన్నారు.
ఓ మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ ఎదుర్కొని ఎందరో ఉద్యమ వీరులను స్మరిస్తూ ముందుకెళ్ళి నటువంటి వ్యక్తి నీతి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, జైలు జీవితాలను గడిపినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో విద్యార్థులను రాజకీయంగా, ప్రగతిశీల ఆలోచనల వైపు, చైతన్యాన్ని ప్రేరేపించే ఉద్యమాలచే ఎంతో మందిని చైతన్య పరుస్తూ విద్యార్థి సంఘం(student union)లో ప్రధాన బాధ్యతలకు బాధ్యత వహిస్తూ మరోపక్క చదువును అధ్యయనం చేశాడు.
అదే క్రమంలో పై చదువుల కొరకు లా సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో అతి తక్కువ ర్యాంకును సాధించి కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) సబ్ క్యాంపస్ లో సీటు సంపాదించాడు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో జిల్లా పీడీఎస్యు గ్రామ ప్రజలు అభినందనీయమని పలువురు హర్షం చేస్తూ అభినందిస్తున్నారు.
