Strict Actions | అమ్మినా.. కొన్నా క‌ఠిన చర్యలు

Strict Actions | అమ్మినా.. కొన్నా క‌ఠిన చర్యలు

  • చైనా మాంజా విక్రయించొద్దు
  • ఎస్సై రామకృష్ణ

Strict Actions | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కిరాణా, జనరల్ స్టోర్ ఇతరులు ఎవరైనా మాంజా దారాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) ఎస్సై రామకృష్ణ అన్నారు. ఆసిఫాబాద్ ఎస్పీ, ఏఎస్‌పీల ఆదేశాల మేరకు ఆయన పోలీసులతో కలిసి ఇవాళ ఉదయం మండల కేంద్రంలో కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. గాలిపటాలకు వాడే మాంజా దారాలను వాడ‌టం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ పేర్కొన్నారు. ఎవరు కూడా మాంజా దారాలను విక్రయించరాదని అయినా సూచించారు. ఈ తనిఖీలో ఏఎస్ఐ, పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply