jaipur | దేశిదారు మద్యం పట్టివేత..

jaipur | దేశిదారు మద్యం పట్టివేత..
jaipur, ఆంధ్రప్రభ : జైపూర్ మండల కేంద్రంలో భారీగా దేశిదారు బాటిళ్లను పోలీసులు పట్టుకున్నట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఎస్టీపిపి ప్లాంటు వద్ద ఎస్సై శ్రీధర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న దేశిదారు మద్యం బాటిళ్ళను పట్టుకున్నారు. చంద్రపూర్ నుండి ఐరి మహారాష్ట్రకు అక్రమ దేశిదారు మద్యం బాటిళ్ళను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.
ఇందులో 2500 దేశిదారు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఒక లక్ష రూపాయలు ఉంటుందని అన్నారు. చంద్రపూర్ కు చెందిన నిఖిల్ రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
