MLA | ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకలు…

MLA | ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకలు…

MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం(MLA Camp Officeలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సతీమణి, సిబిఎం ట్రస్ట్ చైర్‌పర్సన్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు డా. చిక్కుడు అనురాధ జన్మదిన వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు డా. అనురాధ మేడం సేవాభావాన్ని కొనియాడుతూ, సామాజిక సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, పాల కేంద్ర చైర్మన్ నరసయ్య యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply