FM Nirmala Sand Sculpture  |  అబ్బురం Andhra Prabha Real News

FM Nirmala Sand Sculpture  |   అబ్బురం AndhraPrabha Real News

పిల్లలతో నిర్మలమ్మ జోష్​  

బాగా చదవాలి.. రాణించాలి

అన్ని సదుయాలు కల్నిస్తాం

కేంద్రమంత్రి సీత రామన్​​ హామీ

సాగర తీరంలో  సెల్ఫీల జాతర

దత్తత గ్రామంలో  కూటమి నేత సందడి   

 ( నరసాపురం  ,  ఆంధ్రప్రభ )

FM Nirmala Sand Sculpture

రతమాత ముద్దుబిడ్డ.. అపర సీత..జాతి పొదుపుసిరి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​ రాకతో.. ఆమె దత్తత గ్రామం మురిసిపోయింది. అబ్బురపరిచే సైకత శిల్పంతో.. ఆహ్వానం పలికారు. ఒక రకంగా.. ఆ గ్రామంలో ఆనందం వర్షించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైన వానిలంక (Pedamaina vani Lanka)  సముద్ర తీర ప్రాంతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Union Minister Nirmala Sitha Raman)   సైకత శిల్పం (Sand Sculpture) పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. 

FM Nirmala Sand Sculpture

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత  తీసుకున్న పెదమైన వానిలంక గ్రామం లో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా (Sea Shore)  సముద్ర తీరంలో మంత్రి చిత్రం ను సైకత శిల్పి ఇసుకతో అందంగా తీర్చి దిద్దారు. 

FM Nirmala Sand Sculpture

కేంద్ర మంత్రి సీతారామన్ పర్యటన కార్య క్రమంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే లు నాయకర్, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీం అస్మి,  వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరు లను  సైకత శిల్పం (Attracted)   ఆకట్టుకుంది. పలువురు విద్యార్ధులు, మరికొంత మంది సెల్ఫీలు (Selfies)  దిగి తమ ఆనందం ను పంచుకున్నారు. ఈ సందర్భంగా సైఖత శిల్పి ను అభినందనలతో ముంచెత్తారు.

 FM Nirmala Sand Sculpture  : బాగా చదవండి..

FM Nirmala Sand Sculpture

విద్య, క్రీడలు ద్వారానే ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తీసుకు రావచ్చని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నరసాపురం మండలం పెదమైనవాని లంక గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంకు   సహకారంతో రూ.18 లక్షలు విలువచేసే (Computers)  కంప్యూటర్లు, సైన్సు ల్యాబ్లు (Science Lab), తదితర మౌలిక సదుపాయాలను  విద్యార్థులకు అంకితం చేశారు.

FM Nirmala Sand Sculpture : రాణించండి

FM Nirmala Sand Sculpture

 కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్   విద్యార్థులతో మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యం అని విద్యార్థులకు వివరించారు. ఉన్నత చదువులు చదివి దేశానికి మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.  తీరప్రాంత యువతీ, యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని అన్నారు.

FM Nirmala Sand Sculpture

తీర ప్రాంతానికి ఏమి కావాలన్నా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని, మీరు బాగా చదవాలి అని అభివృద్ధి, సంక్షేమం మేము చూసుకుంటామని అన్నారు. చదువుతోపాటు క్రీడల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేది విద్య, క్రీడలు తోనే సాధ్యమని విద్యార్థులు మంచి ఆలోచనలతో ముందుకు సాగి దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత కూడా యువతదేనని అన్నారు.

 FM Nirmala Sand Sculpture  : కూటమి  నేతల సందడి

FM Nirmala Sand Sculpture

ఈ సందర్భంగా   సీతారామన్ తో పాటు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ,  రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు  విద్యార్థిని, విద్యార్థులతో మమేకమయ్యారు .  కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్    కొద్దిసేపు ముచ్చటించారు. కొన్ని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టారు.  డిజిటల్ క్లాసులు ద్వారా ప్రపంచలో జరుగుచున్న వాటిని, ఉన్నత విద్యా ప్రమాణాలు చక్కగా తెలుసు కోవచ్చునని, ప్రతి విద్యార్థి హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి సూచించారు

FM Nirmala Sand Sculpture  : హేమాహేమీల రాక

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ  అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్,  ఏపిఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు, తదితరులు పాల్గొన్నారు.

FM Nirmala Sand Sculpture

ఆర్డీవో దాసి రాజు, డియస్పి డా.జి.శ్రీవేద, యూనియన్ బ్యాంకు యండి ఆశీస్ పాండే, ఎస్ ఎల్ బిసి సి.వి.ఎన్.భాస్కర్, రీజనల్ హెడ్ మన్యం, యస్ యల్ బిసి ఏజియం శ్రీనివాసు, యల్డియం ఏ.నాగేంద్రప్రసాదు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, నరసాపురం టీడీపీ ఇంచార్చి పొత్తూరి రామరాజు,  జిల్లా బిజెపి అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి,

FM Nirmala Sand Sculpture

కేంద్రమంత్రి ప్రతినిధి పేరాల మోహన్, బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచి కొల్లాటి కనకదుర్గ, హెచ్ యం యం.డి. ఇబ్రాహీమ్, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సి.హెచ్. నరసింహాస్వామి, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Operation Aghat 3.0 :  అల్లరి మూకలకు  కళ్లెం AndhraPrabha Real News

Leave a Reply