Greater|గ్రేటర్ విజయవాడ..

Greater|గ్రేటర్ విజయవాడ..
74 గ్రామాల విలీనంతో ప్రతిపాదన..
సీఎం చంద్రబాబును అభ్యర్థించిన ఎంపీ కేసినేని శివనాథ్..
సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు..
అతి త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశం..
Greater|ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఆయన గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ తో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఎంపీ.. గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పై సీఎం చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. విజయవాడ నగర పరిసరాల్లోని 74 గ్రామాల విలీనంతో గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని, దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న గ్రేటర్ విజయవాడ ఏర్పాటు పై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిపాదన పై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించారు.
