Chairman | సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు
- స్వామివారిని దర్శించుకున్న టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు
Chairman | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నూతనంగా నియమితులైన కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి దర్శించుకున్నారు. ఆయనకు స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు అందజేశారు.

