YSRCP | ఘన స‌న్మానం

YSRCP | ఘన స‌న్మానం

  • డాక్టర్ గోపిరెడ్డిని సన్మానించిన పల్నాడు జిల్లా మైనార్టీ నాయకులు

YSRCP | నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట నియోజకవర్గంలో నూతనంగా పార్టీలో పదవులు పొందిన నాయకులందరూ కలసి మంగళవారం వైఎస్సార్ సీపీ వర్కింగ్ జిల్లా ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని (Gpireddy Srinivas Reddy) ఘనంగా గజమాలతో సన్మానించారు. ఇటీవల పదవులు పొందిన జిల్లా మనకి విభాగం ఉపాధ్యక్షులు సయ్యద్ ఖాదర్ బాషా, జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్, జిల్లా సెక్రటరీ సయ్యద్ ఖాజా, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, షేక్ మ‌హ్మ‌ద్ రఫీ, తదితర మైనార్టీ నాయకులు అందరూ కలిసి పట్టణంలోని గుంటూరు రోడ్‌లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గోపిరెడ్డిని సన్మానించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు అండగా నిలుస్తున్న గోపిరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ(YSRCP) బలోపేతానికి కృషి చేస్తామన్నారు.డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేయటంలో మైనార్టీలు ప్రధాన పాత్ర పోషించాలన్నారు.పదవులు పొందిన వారందరూ పార్టీ కోసం మరింతగా కష్టపడి ప‌ని చేయాలన్నారు. ఈ సంద‌ర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply