రాయపోల్, ఆంధ్రప్రభ : తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వీరారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి పాపని నాగమణి వీరస్వామి అన్నారు. ఈ రోజు మండలoలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
తనను గెలిపిస్తే.. వీరారెడ్డి పల్లి గ్రామ ప్రజలకు అండగా వుంటూ గ్రామ అభివృద్ధికి పాటు పడతానన్నారు. సమస్య ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపద సంపదలో గ్రామస్తులందరికి చేదోడు,వాదోడు గా ఉంటానన్నారు.ఇదివరకే గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు.ఈ నెల 11 న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో “ఉంగరం ” గుర్తుకు ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను కోరారు.

