MLA | మన ఊరు..మన బాధ్యత
MLA | మన ఊరు..మన బాధ్యత
– నా బలం.. బలగం మీరే
– గ్రామ అభివృద్ధికి మనమందరం ఒక్కటి అవుదాం..
– కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి
– గ్రామ వికాసమే నా లక్ష్యంగా పనిచేస్తాను
– నందిగామ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ
MLA | నందిగామ, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికే ఓటు వేసి నన్ను గెలిపించండి.. గ్రామ వికాసమే నా లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నందిగామ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ అన్నారు. నా బలం బలగం గ్రామం ప్రజలే అని తెలిపారు. అలాగే ఈసారి కూడా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar), నందిగామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ బరిలో నిలబడ్డానన్నారు.
నన్ను నమ్మి సర్పంచ్, ఎంపీటీసీ పదవులు అందించారు. రొండుసార్లు ప్రజాక్షేత్రంలో నిలబెట్టారు. మీ నమ్మకాన్ని వొమ్ము చెయ్యకుండా గ్రామ అబివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని ప్రజలకు వివరించారు. మరోసారి ఆదరించి కత్తెర గుర్తుకే ఓటు(vote for scissors) వేసి గెలిపించండి, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆపద అంటే క్షణంలో ముందుండే వ్యక్తిగా సేవలందిస్తున్నానన్నారు. గత పదేళ్ళుగా చూస్తున్నారు. ఏనాడైనా గర్వంతో ప్రవర్తించానా అన్నారు. మీ ఇంటి మనిషిగా మీతో కలిసి మెలిగాను.. పెళ్లి పేరంటాలు.. శుభకార్యాలు… కార్యం ఏధైనా తగిన సహకారం అందించి నా బాధ్యతగా ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రియ శిష్యుడి(Priya Shishya)గా కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో సర్పంచ్ బరిలో ఉన్నానన్నారు.
మరోసారి ఆశీర్వదించి కత్తెర గుర్తుకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు. అంతఃకరణ శుద్ధితో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ ప్రజలను కోరారు.
