Doubtful| నామినేషన్ పత్రాలు గాయబ్
Breaking News| వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గిర్మాపూర్(Girmapur) గ్రామపంచాయతీ ఎన్నికల క్లస్టర్‌లో భారీ సంచలనం చోటుచేసుకుంది. నాలుగు గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు(Nomination documents) దొంగతనానికి గురైనట్లు తెలుస్తోంది. గిర్మాపూర్ గ్రామపంచాయతీ భవనం తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు(As if lifted) సమాచారం. ఈ ఘటనపై “ఇది సాధారణ దొంగతనమా? లేక రాజకీయ దొంగల పనేనా?” అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Doubtful | ప్రజల్లో మరిన్ని అనుమానాలు

ఎన్నికల కీలక దశలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్(Umashankar Prasad) ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే అధికారులు మాత్రం “ఆన్ లైన్ లో డేటా ఉందని… సమస్య ఏమీ లేదని” తాపీగా సమాధానం ఇస్తుండటం ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది.

