KOTEKAL DEATH CURVE | మృత్యువు మలుపే

KOTEKAL DEATH CURVE | మృత్యువు మలుపే
- అజాగ్రత్తే చావుకు బోనస్
- కోటేకల్ దుర్ఘటన వెనుక అసలు కథ
- సీటు బెల్టు..బెలూన్ రక్షణ కవచాలు
- విజయనగరం వాసులు సేఫ్
( ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ ప్రతినిధి) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ కొండ మలుపు ( KOTEKAL DEATH CURVE) తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడకక్కడే (Spot Five Lives) ప్రాణాలు వదిలారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్క హోసల్లి బంగారు పేటకు (Bangaru Peta) చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. బంగారు పేట గ్రామానికి చెందిన ఈ ఫ్యామిలీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి (Raghavendra Swamy) దర్శనార్థం షిఫ్ట్ డిజైర్ కారులో శుక్రవారం రాత్రి బయలు దేరారు.

KOTEKAL DEATH CURVE
ఈ కారు కోటేకల్ కొండ సమీపంలో రాగానే కుడి వైపునకు మళ్లింది. విజయనగరం వాసులు అశోక్, మరో ఇద్దరు హైదరాబాదు నుంచి ఆదోనిలో జరిగే పెళ్లి (Marrage Reception) రిసెప్షన్ కు ఫార్చునర్ కారులో వస్తున్నారు. తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు (Snow Fog ) కమ్ముకోవడంతో, ఎదురుగా వస్తున్న నల్లటి ఫార్చునర్ కారు స్విఫ్ట్ డిజైర్ (Swift Dezire Car) కారు డ్రైవర్ కు కనిపించకపోవడం వల్లే, ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో స్విఫ్ట్ డిజైర్ కారు నుజ్జు నుజ్టు కాగా.. కారులోనే మృతులు ఇరుక్కు పోయారు.ఫార్చునర్ కారు (Porchune Car) ముందు భాగం మాత్రం పూర్తిగా దెబ్బతింది. కారులోని బెలూన్లు వెంటనే తెరుచు కోవడం వల్ల వారంతా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గాయాలైన వారందరిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KOTEKAL DEATH CURVE

ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మిగనూరు పోలీసులు (Yemmiganur Police) ప్రమాద స్థలికి చేరుకున్నారు . ఈ దుర్ఘటన తీరును గుర్తించి దిగ్భ్రాంతి చెందారు. స్విఫ్ట్ డిజైర్ కార్లో మృతి చెంది ఇరుక్కున్న మృతులను బయటికి తీసేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి ప్రోక్లైన్ తెప్పించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. దుర్ఘటన స్థలానికి కర్నూలు డీఐజీ కోన ప్రవీణ్ (Kurnool DIG ), ఏఎస్పీ హుస్సేన్ పీరా చేరుకున్నారు. ట్రాఫిక్‌ను వెంటనే క్లియర్ చేయించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఫార్చునర్ కార్ లో వస్తున్న వారంతా డీఐజీ కోన ప్రవీణ్ కు బంధువులని తెలుస్తోంది. అందువల్లనే ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శించినట్లు సమాచారం.
KOTEKAL DEATH CURVE | ప్రమాదంలో మృతులు వీరే

కోటేకల్ కొండ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో హోసూరు జిల్లా చిక్కహోసళ్లి మండలం బంగారుపేట గ్రామానికి చెంది మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశప్ప (76) సతీష్ (34 ) మీనాక్షి (32 ) ఉండగా మరో ఇద్దరు చిన్నారులు బనీత్ గౌడ (5), రిత్విక్ (4) చిన్నారుల మృతదేహా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొంతమంది కారులోనే ఇరుక్కుపోయారు. శవాలను చూసిన స్థానికులు బోరున వినిపించారు.

రక్తపు మడుగులో పడి ఉన్న మరో ముగ్గురి శవాలను చూసి చలించారు. ఇంత పెద్ద ఘోర ప్రమాదం (Fatal Accident) ఇక్కడ జరగడం ఇదే మొదటిసారి అని నిట్టూర్పు వదిలారు. ప్రమాదంలో గాయపడిన గంగమ్మ, చేతన్ ను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమించటంతో (Critical Condition) కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరినీ కారు నుండి బయటికి తీసేందుకు స్థానికులు పోలీసులకు సహాయపడ్డారు.
KOTEKAL DEATH CURVE : కోటేకల్ కొండ మలుపే డెత్ జోన్
ఆదోని ఎమ్మిగనూరు మధ్య కోటేకల్ కొండ మలుపు (Kotekal Hill curve) ఉంది.నేషనల్ హైవే 167 రోడ్డు వేసేటప్పుడు పాత రోడ్డును కాస్త తొలచి రోడ్డును విస్తరించారు. అయినా సరే మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.శనివారం తెల్లవారుజామున రెండు కార్లు ఢీకొని జరిగిన ప్రమాదం కూడా అటువంటిదే. మలుపు కావడం వల్ల (Death Curve) ఎదురుగా వచ్చే వాహనాలు త్వరగా కనిపించవు. పైగా పొగ మంచు కప్పుకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు ఒకదానికొకటి, కనిపించకపోవడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.
KOTEKAL DEATH CURVE : పొగ మంచుతోనే..

చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు (Snow Fog) కమ్ముకుంది.ఇదే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.స్విఫ్ట్ డిజైర్ కారు డ్రైవర్ కాస్త నిద్దర మబ్బులో కారును కుడి వైపునకు, మళ్ళించడం వల్ల ఎదురుగా వస్తున్న ఫార్చునర్ కార్లు ఢీకొనిందని,దర్యాప్తులో పోలీసులు పేర్కొంటున్నారు.సేఫ్టీ బెలూన్స్ లేకపోవడం వల్ల, కారులో అత్యధిక మంది ఉండడం వల్ల ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు.ఫార్చునర్ వాహనంలో ప్రయాణికులు సీటు బెల్టులు (Seat Belt) పెట్టుకోవడం వల్ల, బెలూన్లు (Balloones) తెలుసుకొని అందులో ఉన్నవారికి స్వల్ప గాయాల య్యాయి.వారందరూ ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
KOTEKAL DEATH CURVE : ఇద్దరు చిన్నారులు:-
కోటేకల్ కొండ మలుపు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నడివయస్కులు ఒకరు వృద్ధులు చనిపోయారు వీరికి తోడుగా ఇద్దరు చిన్నారులు చనిపోవడం స్థానికుల మనసును కలచివేసింది ఇద్దరు చిన్నారులు మృతి (Two Children Dead) చెందిన పడుకున్న పాపల్లా ఉండడం అందరికీ కంటతడి పెట్టించింది ప్రమాద స్థలికి వచ్చిన ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలను కూడా తీసుకు పోయావా దేవుడా అంటూ విలపించారు.
KOTEKAL DEATH CURVE : సహాయ చర్యల్లో పోలీసులు బిజీబిజీ

రెండు కార్లు ఢీకొన్న శనివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది.ఈ విషయం సామాజిక మధ్యమాల్లో క్షణాల మీద చేరిపోయింది.విషయాన్ని తెలుసుకున్న డీఐజీ కోనా ప్రవీణ్,ఎస్పీ హుస్సేన్ పీరా డి.ఎస్.పి భార్గవి సీఐలు శ్రీనివాస్, చిరంజీవి శ్రీనివాసులు, ఎర్రన్న, సిబ్బంది ప్రమాద స్థలానికి (Polce Officers Busy) చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ముందుగా క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారులోనే చనిపోయిన వారంతా ఇరుక్కుపోవడంతో, వారందిని బయటకు తీసేందుకు చాలా కష్టపడ్డారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు రాకపోవడంతో,వెంటనే ప్రోక్లైన్ (Proclain) తెప్పించి దాని సహాయంతో లోపల ఇరుక్కున్న ఐదు శవాలను, బయటకు తీసి రోడ్డు పక్కనే వస్త్రాలను కప్పారు
KOTEKAL DEATH CURVE : ప్రమాద స్థలిలో .. ఎమ్మెల్యే

తెల్లవారుజామున జరిగిన రెండు కార్ల రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న,ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి (MLA Jaya Nageswara Reddy) వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు.అక్కడికి వచ్చిన పోలీసులు ద్వారా జరిగిన విషయాలు తెలుసుకున్నారు.వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వారికి ఆదేశించారు. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించడంలో కూడా ఎమ్మెల్యే సహకారం అందించారు.
కేవలం షిఫ్ట్ డిజైర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు.పొగ మంచు కారణంగా షిఫ్ట్ డిజైర్ డ్రైవరు కుడి వైపు వెళ్లడం వల్ల ఎదురుగా వస్తున్న ఫార్చునర్ కారును ఢీ కొట్టిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కర్ణాటకలోని కోలార్ జిల్లా బంగారు పేట కు చెందిన మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.శవ పరీక్షా అనంతరం శవాలను వారి బంధువులకు అప్పగించారు.
