CM Siddaramaiah | మా మధ్య భేదాభిప్రాయాలు లేవు..

CM Siddaramaiah | మా మధ్య భేదాభిప్రాయాలు లేవు..

CM Siddaramaiah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో (Karnataka politics) గత కొద్ది రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతలు, సీఎం మార్పు ఊహాగానాలు చివరకు సద్దుమణిగాయి. ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశం తర్వాత పరిస్థితులు స్పష్టమయ్యాయి.

కర్ణాటకలో గత కొన్ని రోజులుగా వేడెక్కిన రాజకీయాలు చల్లబడ్డాయి. సీఎం మార్పుపై ఊహాగానాల వేళ.. ఈ ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య ‘బ్రేక్‌ఫాస్ట్‌’ (Breakfast) భేటీ జరిగింది. అనంతరం మీడియాతో ఇద్దరు నేతలు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి డీకేతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. భవిష్యత్‌లోనూ ఉండబోవని సిద్ధరామయ్య ప్రకటించారు. 2028లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ప్రకటించారు.