Ambedkar|అంబేద్కర్ కు ఎమ్మెల్యే ఘన నివాళి

Ambedkar| పెడన, ఆంధ్రప్రభ : 76వ పెడన నియోజకవర్గం పెడన టౌన్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలం రాజ్యాంగమే.. ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగం మనదేనని అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయి న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని.. విశిష్ట లక్షణాల వల్లే భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అట్టడుగు స్థాయి నుంచి శిఖరాలకు ఎదిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందరికీ ఆదర్శమని.. దళితుల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవితాన్ని అర్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు
